ఆంధ్రప్రదేశ్

తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గిరిజన రైతుల ధర్నా

3 Viewsవిజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొట్టూరు పంచాయతీ కూడుమూరు రెవెన్యూలోని సర్వే నెంబర్‌ 48లో 782 ఎకరాల ప్రభుత్వ భూమిని తరతరాలుగా సాగుచేస్తున్న గిరిజన రైతులకు సాగుపట్టాలివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. సుమారు వంద మందికి పైగా గిరిజన రైతులతో కూడుమూరు నుంచి పాచిపెంట తహశీల్దార్‌ కార్యాలయం వరకూ సుమారు 18 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. […]

2.15 లక్షల సిసిఆర్‌సిలు

3 Viewsవ్యవసాయదారులకు పెట్టుబడి సాయం అందించేందుకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించి ఏడు వారాలు గడిచినా కౌల్దార్ల విషయంలో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు కేవలం 57 వేల మంది కౌలు రైతులకే భరోసా సొమ్ము అందింది. కౌలు రైతుల సంఖ్యపై వివిధ అధ్యయనాల్లో తేల్చిన, అసెంబ్లీలో సర్కారు ఇస్తామని హామీ ఇచ్చిన, చివరికి భరోసా ప్రారంభ సమయంలో అందిస్తామని నిర్ణయించిన లక్ష్యంలో చాలా తక్కువ మందికి సొమ్ము జమ అయింది. దరఖాస్లులకు […]

తెలంగాణ

ఉల్లి ధరలు రికార్డు కేజీ రూ.150

3 Viewsహైదరాబాద్ లో ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి.. బహిరంగ మార్కెట్ లో కేజీ రూ.120 నుంచి రూ.150 పలుకుతుంది. అకాల వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినడంతో మహారాష్ట్ర , కర్నూల్ ,మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ మలక్ పేట్ మార్కెట్ కు ఉల్లి ఆశించిన స్థాయిలో రాక పోవడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. మాములుగా రోజు లక్ష బస్తాల ఉల్లి వస్తే.ప్రస్తుతం […]

క్రైమ్

యువతిపై సహోద్యోగి అత్యాచారం

3 Viewsజైపూర్‌ : మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ వారిపై దాడులు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఓ యువతిపై సహోద్యోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన ఓ 19ఏళ్ల యువతి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు శిక్షణ నిమిత్తం కోసం జైపూర్‌కు వచ్చారు. గత వారం ఓ క్లబ్‌లో స్నేహితులు ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారు. ఆమె సహోద్యోగి కూడా ఆ పార్టీకి హాజరయ్యాడు. పార్టీ అనంతరం ఆమెను హోటల్‌ సమీపానికి […]

క్రీడలు

ఉప్పల్‌లో తొలి సమరం : భారత్ – వెస్టిండీస్ టీ 20 సిరీస్

4 Viewsవరల్డ్ కప్ కంప్లీట్ అయిన వెంటనే… వెస్టిండీస్‌లో పర్యటించింది టీమిండియా. మూడు ఫార్మాట్లలోనూ ఎదురు లేదని నిరూపించి.. కరేబియన్లకు చుక్కలు చూపించింది. ఇప్పుడు మూడు టీ20లు, మూడు వన్డేల కోసం ఇండియాకు వచ్చింది విండీస్. ఇందులో భాగంగా 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం ఫస్ట్ టీ ట్వంటీలో భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ సేనను ఢీకొట్టబోతోంది. ఉప్పల్ స్టేడియం సిద్ధమవడంతో ఫ్యాన్స్ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ […]

ఖోఖోలో స్వర్ణాలు

3 Viewsఖాట్మండు : ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. దీంతో ఇప్పటివరకూ అథ్లెటిక్స్‌లో భారత్‌ 10 పతకాలను అథ్లెటిక్స్‌లో సాధించినట్లైంది. ఇందులో 5 స్వర్ణ, 3 రజిత, 2 కాంస్యాలున్నాయి. మహిళల 200మీ. పరుగులో అర్చన 23.67 సెకన్లలో గమ్యానికి చేరి ఈ పోటీల్లో రెండో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకోగా.. సురేష్‌ కుమార్‌ పురుషుల 10వేల మీటర్ల పరుగును 29ని. 32 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి గెలిచాడు. దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ […]

సినిమా

డిసెంబర్ 6న ’90 ML’ చిత్రం విడుదల

1 Viewsహీరో కార్తికేయకి `ఆర్ఎక్స్‌100` వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర తో నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన `90 ml` ని ఈ నెల 6న విడుదల చేయనున్నారు. నేహా సోలంకిని హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పాటలకి, ప్రమోషనల్ టూర్లకి, ప్రీ రిలీజ్ ఈవెంటుకి అనూహ్య స్పందన […]