ఆంధ్రప్రదేశ్

సోమవారాని వాయిదా పడ్డ ఏపీ కేబినెట్ మీటింగ్

5 Viewsఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఉన్నట్టుండి ఈ భేటీ ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించడానికి సోమవారం వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. రాజధాని రైతుల అభ్యంతరాలు కొలిక్కి రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా […]

భవిష్యత్ కార్యాచరణపై జనసేన చర్చలు

5 Viewsతెలుగు గడ్డపై జనసేన పురుడు పోసుకొని ఆరేళ్లు కావొస్తుంది. భారీ అంచనాలతో వచ్చిన పార్టీకి పవన్ చరిష్మా పాపులారిటీ తీసుకొచ్చినా.. బ్యాలెట్ మందు మాత్రం బోర్లా పడుతోంది. కొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి. దీంతో ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశాడు పవన్ కళ్యాణ్. బీజేపీతో పొత్తుకు పెట్టుకొని స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతూనే తమ సొంత పార్టీని కూడా జనంలోకి తీసుకెళ్లేందుకు జనసేన కార్యచరణ రూపొందిస్తోంది. దీనిపై చర్చించేందుకు మంగళగిరిలోని జనసేన పార్టీ […]

తెలంగాణ

పురపోరులో తండ్రి కలను కొడుకు నెరవేరుస్తాడా.. ?

5 Viewsతెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. జోరుగా ప్రచారాలను సాగిస్తూ. ఈ సారి కూడ భారీ మెజారీటితో గెలిచి తమకు తిరుగులేదని చాటుకోవాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుండగా, కనీసం ఈ మున్సిపల్ ఎలక్షన్స్‌లోనైనా కారు స్పీడ్‌కు బ్రేక్ వేసి ఆపాలని ప్రతిపక్షాలు గట్టి నిర్ణయంతో ఉన్నట్లుగా సాగుతున్న ఈ పురపోరులో తుది విజయం ఎవరిని వరిస్తుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

క్రైమ్

మరోసారి లవ్‌ జీహాద్‌ కలకలం

5 Viewsదశాబ్దకాలంగా కేరళలో లవ్‌జీహాద్‌ వివాదం కొనసాగుతోంది. మొదట్లో పదుల సంఖ్యలో వచ్చిన ఆరోపణలు.. ఇప్పుడు వేలసంఖ్యలకు చేరుకున్నాయి. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్రంలోని అతిపెద్ద చర్చ్‌ సిరో మలబార్‌ క్యేథలిక్‌ ప్రతినిధులు స్పందించడంతో… మరోసారి లవ్‌జీహాద్‌ వివాదం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో లవ్‌ జీహాద్‌ కొనసాగుతున్నది నిజమేనని.. క్రైస్తవ ప్రతినిధులు స్పష్టం చేశారు. క్రైస్తవానికి చెందిన అమ్మాయిలను ఈ రొంపిలోకి దింపి ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసిస్‌కు చెందిన ఉగ్రవాదులు.. ఇతర […]

క్రీడలు

ఖోఖో సెమీస్‌లో తెలంగాణ

6 Viewsహైదరాబాద్ : గువాహటి వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. అండర్‌-17 బాలుర జట్టు ఖోఖో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన క్వార్టర్స్‌లో తెలంగాణ 20-16 తేడాతో విజయం సాధించింది. మరోవైపు అండర్‌-17 బాలికల టెన్నిస్‌లో రాష్ర్టానికి చెందిన సంజన 6-3, 6-1తో పారిసింగ్‌(హర్యానా)పై అలవోక విజయం సాధించింది. అండర్‌-21 బాలికల విభాగంలో సాత్విక 6-0, 6-0తో శృతి(డామన్‌ అండ్‌ డయ్యు)ని చిత్తుగా ఓడించింది. అండర్‌-17 బాలుర సింగిల్స్‌ […]

మనీశ్ పాండే స్టన్నింగ్ క్యాచ్…వైరల్ వీడియో!

10 Viewsశుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత ఫీల్డర్ మనీశ్ పాండే కళ్లు చెదిరే క్యాచ్‌ని అందుకున్నాడు. 341 పరుగుల లక్ష్యఛేదనలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ (15: 12 బంతుల్లో 2×4).. మహ్మద్ షమీ బౌలింగ్‌లో బంతిని పాయింట్- కవర్‌కి మధ్యలో ఫీల్డింగ్ చేస్తున్న మనీశ్ పాండే తలపై బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ.. గాల్లోకి ఎగిరిన మనీశ్ పాండే ఒంటిచేత్తో బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో.. వార్నర్ కూడా కాసేపు నమ్మలేనట్లు […]

సినిమా

వైజాగ్ లో అల సక్సెస్ మీట్..

6 Viewsఅల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అల వైకుంఠపురం లో చిత్రం సంక్రాంతి బరిలో వచ్చి భారీ సక్సెస్ సాధించింది. బన్నీ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగులు పెడుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కు ప్లాన్ చేసింది. ఈనెల 19న బీచ్ సిటీ గా పేరున్న వైజాగ్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే 24న తిరుపతి, కర్ణాటక, […]