తగ్గుముఖం పట్టిన వరద

న్యూస్
126 Views

కర్నూలు: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు నదుల నుంచి ఒకేసారి వరద పోటెత్తడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం నాటికి తుంగభద్ర నుంచి ఇన్‌ఫ్లో ఒక్కసారిగా లక్ష క్యూసెక్కుల పైగా తగ్గిపోవడంతో నదీ తీర ప్రాంతాలు, కర్నూలుకు ముప్పుతప్పినట్లే అంటున్నారు అధికారులు. కృష్ణా నుంచి మాత్రం వరద స్థిరంగా కొనసాగుతోంది. వచ్చిన నీటిని వచ్చినట్లే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు వదిలేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి సోమవారం 2.54 లక్షల క్యూసెక్కుల నీటిని అన్ని గేట్లు తెరిచి కిందకు వదిలారు. మంగళవారానికి వరద పెరుగుతుందని అందరూ భావించినా ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *