తెలంగాణలోని చేనేత కార్మికులకు తానా చేయూత

తెలంగాణ
142 Views

తెలంగాణలోని చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకు వచ్చింది. చేనేత కార్మికులకు అవసరమైన అసు యంత్రాల పంపిణీకి తానా సహకారం అందించనున్నది. ఈ యంత్రాలకు అవసరమయ్యే మొత్తం వ్యయంలో 50శాతం ఖర్చును తానా భరిస్తుంది. 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మరో 25శాతాన్ని లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో తానా ఒప్పందం కుదుర్చుకుంది. స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ సమక్షంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, జౌళిశాఖ కార్యదర్శి శైలజా అయ్యర్‌, తానా ప్రతినిధులు వల్లేపల్లి శశికాంత్‌, శృంగవరపు నిరంజన్‌, కోయ హరీష్‌, చింతకింది మల్లేశం ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో వేయిమందికి ఈ యంత్రాలను పంపిణీ చేయనున్నారు. తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి మాట్లాడుతూ, నేతన్నలను ఆదుకోవడం అందరి బాధ్యత అంటూ, తెలంగాణలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని నేతన్నలను కూడా ఆదుకుంటామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *