మాజీ ఎం.పి.పి చిన్న నరసింహ రెడ్డి గుండె పోటుతో మృతి

న్యూస్
17 Views

మాజీ ఎంపిపి చిన్న నరసింహ రెడ్డి మృతి

సంతాపం తెలిపిన బివీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు , ఆగస్టు 02 , ( సీమ కిరణం న్యూస్ ) :

నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన చిన్న నరసింహ రెడ్డి( 75) గుండె పోటుతో మృతి చెందారు. ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్బీఎస్ కానిలీ లో తమ సొంత ఇంటిలో ఉదయం టిఫెన్ చేసి బయటికి వెళుతున్న సమయంలో ఇంటి ఆవరణలో ఉన్నట్టుండి క్కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వచ్చి చూసి ఆసుపత్రి కి తరలించేలోపు మరణించాడు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండల పరిషత్తు అధ్యక్షుడిగా టిడిపి తరుపున పని చేశారు. నరసింహ రెడ్డి కుమారుడు నారాయణ రెడ్డి ఎమ్మిగనూరు రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు గా ఉన్నారు. మాజీ మంత్రి బివీ మోహాన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు. నందవరం మండలంలో నరసింహ రెడ్డి కి మంచి పేరు ఉంది. సౌమ్యంగా సోదర భావంతో ఉండే వారు. సమాచారం తెలుసున్న మాజీ ఎంఎల్ఏ బీవీ జయనాగేశ్వర రెడ్డి తో పాటు టిడిపి నాయకులు ఎమ్మిగనూరు పట్టణంలోని నరసింహ రెడ్డి ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. నరసింహ రెడ్డి చేసిన సేవలను స్మరించికున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *