వైకాపా కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌ లక్ష్యం : వైకాపా కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి

న్యూస్
14 Views
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరిగింది

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌ లక్ష్యం

కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నాం
ఆరు దశాబ్దాల కల నెరవేరిన రోజు
వైకాపా కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి
కర్నూలు  టౌన్, ఆగస్టు 01, ( సీమ కిరణం న్యూస్) :  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరిగిందని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమని వైకాపా కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్‌ బిశ్వభూషన హరిచందన్‌ ఆమోదం తెలపడంపై  వైకాపా కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  వైకాపా కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి  ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్బిఐ సర్కిల్లో ఉన్న వైయస్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం పూలమాలలతో సత్కరించారు. అనంతరం బాణ సంచా  కలుస్తూ మిఠాయిలు పంచి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  రాజా విష్ణువర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ  కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నామని ఆరు దశాబ్దాల కల నెరవేరిన రోజు అన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *