ఎస్.జె.ఆర్.ఓ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వీరరాఘవ నియామకం...

ఎస్.జె.ఆర్.ఓ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వీరరాఘవ నియామకం… SEEMA KIRANAM NEWS

న్యూస్
18 Views

-: నియామక పత్రాన్ని అంద జేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు

కర్నూలు ప్రతినిధి, జులై 30, ( సీమ కిరణం న్యూస్) :
సమాచార హక్కుచట్ట కార్యకర్తగా ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం గత 11 ఏళ్లుగా స్వచ్ఛందంగా పనిచేస్తూ గ్రామీణ, వ్యవసా య, విద్య, కార్మిక రంగాలలోని సమస్యలపై అవగాహన సంపా దించి వాటి  పరిష్కార మార్గా లపై క్షేత్రస్థాయి ప్రజానీకానికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని వీర రాఘవ అన్నారు.
తాను నిరంతరం కృషిని గుర్తిం చిన సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియ మిస్తూ నియామక పత్రాన్ని ఎస్.జె.ఆర్.ఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జక్కా సాయిబాబు చేతుల మీదుగా గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సమాజంలో అపరి ష్కృతంగా పేరుకు పోయిన అన్నివర్గాల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సత్వర న్యాయం అందేలా కృషి చేశామన్నారు. తద్వారా అవినీతిరహిత, నేరరహిత,  శాంతియుత సమాజం ఏర్పాటు చేయాలన్నదే తమ ప్రధాన ఎజెండాగా సోషియల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గ నైజేషన్ అవిర్భవించిందని జక్కా సాయి బాబు  వివరించారు.
జిల్లా ప్రధానకార్యదర్శి వీరరాఘవ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా సమాచార  హక్కు చట్ట కార్యకర్తగా ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం పనిచేసిన తన నిబద్ధతనే నిదర్శనమన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యక్షంగా పూనుకునే అవ కాశం ఎస్.జె.ఆర్.ఓ ద్వారా లభించిందన్నారు.
కర్నూలు జిల్లాలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి తమ సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చిన స్టేట్ జనరల్ సెక్రటరీ జక్కా సాయిబాబు,రాష్ట్ర  అసిస్టెంట్ డైరెక్టర్ పట్నాల సాయికుమార్, సంస్థ పెద్దలకు తన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే మొదట గా జిల్లా కమిటీ,  తాలూకా, మండల, గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. లాభా పేక్ష లేకుండా నిస్వార్ధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండే యువత జిల్లా ప్రధాన కార్య దర్శి వాట్సాప్ 93814 09802 ను సంప్రదించవచ్చన్నారు.
—–
తనపై ఉంచిన గురుతర బాధ్యతకు శక్తివంచన లేకుండా తన వంతు సహాయ సహకారాలు అందిస్తా. జిల్లాలోని ప్రధాన సమస్యల  పరిష్కారానికి అలు పెరుగని పోరాటాలు చేసి సాధించుకుంటాం.
— వీరరాఘవ.,
—–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *