T.G. VENKATESH

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఎంపీ టీజీ వెంకటేష్

ఆంధ్రప్రదేశ్
23 Views
-: ప్రాణాపాయ స్థితి నుండి గర్భిణీ ప్రాణాలు కాపాడిన వైనం

కర్నూలు టౌన్, జులై 29, ( సీమ కిరణం న్యూస్) :
అసలే కరోనా కష్టకాలం. వేళ కాని వేళ తీవ్ర రక్త స్రావంతో నిండు గర్భిణీ తీవ్ర ఇబ్బంది పడుతూ ఓ ప్రముఖ వైద్య శాలకు ప్రాణాలు కాపాడతారని కోటి ఆశలతో ఫోన్ చేయగా అక్కడి నుండి ఎలాంటి స్పందన లేదు. చేసేదిలేక మానవత్వం ఉన్న పెద్దమనిషి చరవాణికి ఫోన్ చేయగా ఆ సమయంలో సైతం తన ఫోను ఎవరైనా సరే తీసి మాట్లాడా లని దృఢ సంకల్పంతో ముం దుకు రాగా ఆయనకు దుఃఖ సాగరంలో ఉంటూ తమ బిడ్డ ప్రాణాలను ఎలాగైనా కాపాడా లని వేడుకుంది. అందుకు చలించిపోయిన ఆ పెద్దమనిషి మరెవరో కాదు.. మానవత్వా నికి నిలువెత్తు నిదర్శనమైన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్.
బాధితురాలు తల్లి తమ సమస్యను టీజీకి పూర్తిగా వివరించింది. తక్షణమే టీజీ గౌరీ గోపాల్ వైద్యశాలకు వెళ్లి
చికిత్స పొందాలని సూచిం చారు. బాధితులు బి క్యాంప్ శివారు ప్రాంతం నుండి వైద్య శాల చేరుకొనే లోగానే అక్కడి వైద్యులకు తానే వారి సమస్యను విశదీకరించారు. దీంతో వారి సమస్య పరిష్కారా నికి మార్గం మరింత సుగమం అయ్యింది.
అనంతరం బాధితురాలి తల్లి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారు ఎవరైనా సరే టీజీ దృష్టికి సమస్యను తీసుకెళ్తే, కాదు కూడదు లాంటి మాటలు చెబుతూ దాటి వేయకుండా, శక్తివంచన లేకుండా సమస్య పరిష్కారానికి సుగమమైన బాటలు వేసేందుకు ఆయన ముందువరుసలో ఉంటారని చెప్పడానికి మాసమస్యనే నిలువెత్తు నిదర్శనమని, ఆయనకు ఆయనే సాటి అని మరోమారు నిరూపించు కున్నారన్నారు.  అందుకు ఆ కుటుంబ సభ్యులు టీజీ వెంకటేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *