SEEMA KIRANAM NEWS

కిరణ్ కుమార్ కు అభినందన

క్రీడలు
17 Views
కర్నూలు స్పోర్ట్స్ , జూన్, 22,( సీమ కిరణం న్యూస్) :
జిల్లా ఎస్సీ.ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారుడు ఈ కిరణ్ కుమార్ కు జిల్లా నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యా యుల సంఘం ఘనంగా సన్మానించింది. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో సన్మాన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చిన్న సుంకన్న ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకులు జోసఫ్, రమణయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీలో యువతతో పాటు క్రీడాకారులకు చోటు కల్పించడం శుభపరిణామమన్నారు.అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు చాణిక్య దాస్ ,నాగరాజు ,ఎమ్మార్పీఎస్ నాయకులు రమేష్ ఎం ఎస్ ఎఫ్ నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *