SEEMA KIRANAM NEWS

రోడ్డు ప్రమాదాల పై జాగ్రత్తలు తీసుకోండి : ఆర్ వి హెచ్ ఆర్

న్యూస్
17 Views

డోన్ టౌన్, జూన్ 22,( సీమ కిరణం న్యూస్) :

డోన్ పట్టణం నేషనల్ హైవే 44 పోలీస్ స్టేషన్ దగ్గర  20/06 నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది క్షతగాత్రులయ్యారు అందులో వడ్డె మద్దమ్మ మరణించిన విషయం అందరికీ తెలిసిందే  అయితే కొందరు ఇంకా  హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై రెవల్యూషనరీ వాయిస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఆర్ వి హెచ్ ఆర్) సభ్యులు డోన్ బైపాస్ క్రాస్ రోడ్ వద్ద వాహనాల యాక్సిడెంట్లు ఇక మీదట జరగకూడదు అంటే శాశ్వతంగా ఫ్లైఓవర్ కానీ సబ్వే కాని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం వారు ప్రజలకు కలిగే ప్రమాదాలను నివారించే వారవుతారని అంత వరకు తాత్కాలికంగా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని దీనివల్ల వాహనాలు ప్రమాదం కనీసం కొద్దీ వరకైనా తగ్గడానికి అవకాశం ఉందని. అలాగే ఈ ప్రమాదంలో మరణించిన మద్దమ్మ కుటుంబానికి 15 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు సహాయార్థంగా చెల్లించాలి మరియు వారి వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరించాలని డోన్ పట్టణ తాసిల్దార్ నరేంద్రనాథ్ రెడ్డికి మరియు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శివ శంకర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు అధికారులు సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా దీనిపై అధికారులకు తెలియజేస్తామని ప్రమాదాలు అరికట్టే చర్యలు ఆచరణలో రావడం వల్ల అందరికీ మంచిదే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవల్యూషనరీ వాయిస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ మోహన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ నవీన్ కుమార్, ట్రెజరర్ ఉన్ని గొర్ల జనార్ధన్, మెంబర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *