SEEMA KIRANAM NEWS

లివర్ సమస్యతో బాధపడుతున్న విజయశాంతికి డోన్ రైల్వే సేవ బృందం చేయూత : SEEMA KIRANAM NEWS

ఆంధ్రప్రదేశ్
19 Views

డోన్ టౌన్, జూన్ 22,  ( సీమ కిరణం న్యూస్ ) :
డోన్ నగరంలోని  టీచర్స్ కాలనిలో నివాసం ఉంటున్న విజయశాంతి అనే ఆమెకు లివర్ ప్రాబ్లెమ్ వల్ల రక్తం వాంతులు అవుతున్నాయి వెంటనే ఆపరేషన్ చేసి లివర్ తీసి  అమార్చాల్సి ఉంది దీనికి తన భర్త లివర్ను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే దాదాపు 40 లక్షలు రూ,,లు ఖర్చు అవుతుంది.  వీళ్లుకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు చాలా పేదవారు కావడంతో దీనిని గమనించి ఆపరేషన్ ఫ్రీగా చేస్తామని డాక్టర్స్ చెప్పారు. కానీ మెడికల్ టెస్ట్లు, మెడిసిన్ కు 12 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ద్రోణాచలం సేవా సమితి  మరియు పోస్ట్ ప్రసాద్ వారిద్వారా ఈ   పరిస్థితిని తెలుసుకొని  డోన్ రైల్వే సేవ బృందం శాంతి కి 28000 రూపాయిలు అందించటం జరిగింది. ఈ సహాయానికి వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ శ్రీనివాసులు,m. భాస్కర్ రావు, జి గంగారావు, సుధాకర్, డివి రావు, ఏ  శ్రీనివాసులు, డి సి శేఖర్, కే శేఖర్, టీఎం రామకృష్ణ, యం గంగాధర్ రావు, వీరప్రసాద్, రైల్వే సేవ బృందం సభ్యులు, ద్రోణాచలం సేవ సభ్యులు షాది ఖానా రాజా , తాహిర్, సుధాకర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *