లాక్ డౌన్ తర్వాత ముందుకొచ్చిన హీరోలు

సినిమా
61 Views

గత రెండున్నర నెలలుగా షూటింగుల్లేక పరిశ్రమ అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. మహమ్మారీ విజృంభణ పరిశ్రమల దూకుడుకు.. హీరోల స్పీడ్ కు చెక్ పెట్టేసింది. ఎవరూ ఎటూ వెళ్లలేని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. షూటింగులు ఆపేసి ఇండ్లలోనే టైమ్ స్పెండ్ చేయాల్సొచ్చింది. అయితే ఈ సుదీర్ఘ విరామం మన హీరోలు సహా సెలబ్రిటీలకు మరపు రాని జ్ఞాపకాల్ని పొందుపరిచిందని చెప్పొచ్చు.తాజాగా ఏపీ-తెలంగాణలో షూటింగులకు ప్రభుత్వాల నుంచి లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. అయితే షూటింగులు ప్రారంభించినా సెట్స్ కి రాలేమని పలువురు స్టార్ హీరోలు షరతులు పెట్టడంతో చాలామంది అసలు హీరోలు అవసరం లేని సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు రీషెడ్యూలింగ్ చేసుకున్నారని గుసగుసలు వినిపించాయి. అయితే ఎవరు ఔనన్నా కాదన్నా తాము మాత్రం సిద్ధంగా ఉన్నామని పెండింగ్ షూట్లు పూర్తి చేసేస్తామని ముందుకొచ్చిన ఓ ఇద్దరు హీరోల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ ఇద్దరు ఎవరు? అంటే ఒకరు మాస్ మహారాజా రావితే.. ఇంకొకరు వెర్సటైల్ స్టార్ శర్వానంద్. రవితేజ క్రాక్ సహా శర్వా శ్రీకరం షూటింగులు 20 రోజుల షూట్ పెండింగ్. ఆ బ్యాలెన్స్ చిత్రీకరణలు పూర్తి చేసేందుకు ఆ ఇద్దరు హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. జూన్ నుంచి షూట్ పూర్తి చేయనున్నారట. తొలిగా మాస్ మహారాజా రవితేజ సెట్స్ కి ఎటెండవుతున్నారట. క్రాక్ చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట- గోపి ఆచంట శ్రీకరం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *