వోడాఫోన్‌ ఐడియా షేరులో లాభాల స్వీకరణ

బిజినెస్‌
40 Views

21.50శాతం పతనమైన షేరు టెలికాం రంగానికి చెందిన వోడాఫోన్‌ ఐడియా షేరు మంగళవారం ట్రేడింగ్‌లో 21.50 శాతం నష్టాన్ని చవిచూసింది. సెర్చింగ్‌ సంస్థ గూగుల్‌ ఈ కంపెనీలో 5శాతం వాటాను కొనుగోలు చేయవచ్చనే వార్తలు వెలుగులోకి రావడంతో గత 10ట్రేడింగ్‌ సెషన్‌ల్లో ఈ షేరు ఏకంగా 129శాతం లాభపడింది. ఈ నేపథ్యంలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *