తండ్రీ కొడుకుల క్రేజీ గ్యాంగ్ స్టార్ మూవీ!

సినిమా
48 Views

సినిమా ఇండస్ట్రీలో తండ్రీకొడుకులు హీరోలుగా సినిమాలు చేస్తే అది చాలా స్పెషల్ గా ఉంటుంది. టాలీవుడ్ లో ఏఎన్నార్ – నాగార్జున, ఎన్టీఆర్ – బాలకృష్ణ, కృష్ణ – మహేష్.. ఇలా తండ్రే కొడుకులు కనిపించిన సినిమాలు అభిమానులకు చాలా ప్రత్యేకం. అయితే పూర్తి స్థాయిలో తండ్రీ కొడుకులు హీరోలుగా చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. టాలీవుడ్ లో కాదు కానీ కోలీవుడ్ లో ప్రస్తుతం ఈ తరహా ప్రయత్నం జరుగుతోంది.

కోలీవుడ్ లో విక్రమ్, తన కొడుకు ధృవ్ కలిసి సినిమా చేయనున్నారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈరోజు అది అధికారికమైంది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే గ్యాంగ్ స్టర్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతోందని అర్ధమవుతోంది. గన్ తండ్రి తన కొడుక్కి ఇస్తున్నట్లుగా ఆ పోస్టర్ లో ఉంది. ఒక గ్యాంగ్ కు హెడ్ గా ఉన్న తండ్రి, తన కొడుక్కి వారసత్వంగా గన్ ను ఇస్తున్నాడు అనే పాయింట్ ను కూడా మనం అర్ధం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *