మందగమనం కొనసాగితే విదేశీ వాణిజ్యంపై ప్రభావం

బిజినెస్‌
43 Views

ముంబయి: దేశ వృద్ధి నెమ్మదించడం చాన్నాళ్ల పాటు కొనసాగితే విదేశీ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా రూపాయి క్షీణతకు దారితీయొచ్చని తెలిపింది. అంతర్జాతీయగా ముడి చమురు ధరల క్షీణించిన నేపథ్యంలో ప్రస్తుతానికి విదేశీ వాణిజ్యం మంచి స్థితిలోనే ఉందని పేర్కొంది. ‘చమురు ధరలు ఇలాగే తక్కువ స్థాయిలో కొనసాగుతూ, ఎలాంటి ఒడుదొడుకులకు లోనుకాకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని కరెంటు ఖాతా మిగులుతోనే భారత్‌ ముగించే అవకాశం ఉంద’ని నివేదిక వెల్లడించింది. ఒకవేళ బ్యారెల్‌ చమురు ధర 40 డాలర్లకు ఎగువన చాణ్నాళ్లు కొనసాగితే కరెంటు ఖాతా మిగులు క్షీణించొచ్చని దారితీయొచ్చని పేర్కొంది. 2016-17లో 8.3 శాతంగా ఉన్న దేశ జీడీపీ వృద్ధి.. 2019-20లో 4.2 శాతానికి పరిమితమైన విషయాన్ని ప్రస్తావిస్తూ 2020-21లో సగటు వృద్ధి -5 శాతంగా ఉండచ్చని తెలిపింది. 2019-20 స్థాయిలతో పోలిస్తే దేశ వృద్ధిపై కనీసం 9 శాతం మేర కొవిడ్‌-19 కారణంగా ప్రభావం పడిందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం విదేశీ రుణాల స్థితి ఒక్కటే ఊరట కలిగించే అంశమని తెలిపింది. 2019 జూన్‌చివరి నాటికి జీడీపీలో విదేశీ రుణాల నిష్పత్తి 19.8 శాతంగా ఉందని నివేదిక పేరొంకది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *