3వేల 795 వీఆర్వో పోస్టుల భర్తీకి ఏపీ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్
17 Views

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 3వేల 795 గ్రామ రెవెన్యూ అధికారుల (VRO)గ్రేడ్‌ -2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్‌వో (గ్రేడ్‌-2) పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) లుగా పనిచేస్తున్న అర్హులకు వన్‌టైమ్‌ ప్రాతిపదికన వీఆర్‌వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్లు విజ్ఞప్తులు చేశాయి.

వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఐదు నెలల కిందటే ఓ నిర్ణయం తీసుకుంది. 3,795 వీఆర్‌వో పోస్టులను ఇంటర్మీడియెట్‌ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్‌ఏలతో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. రెవెన్యూ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జిల్లా కలెక్టర్లు ఫైలును పక్కన పెట్టారు. దీంతో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మరోసారి విజ్ఞప్తి చేయడంతో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతల్లో కొన్ని సడలింపులు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *