టీఆర్ఎస్ నెక్ట్స్ టార్గెట్ అదే.. కేటీఆర్ మళ్లీ మ్యాజిక్ చేస్తారా?

తెలంగాణ
16 Views

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అదే 2021 జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు, కసరత్తు చేస్తోంది. ఓ రోడ్ మ్యాప్‌ను టీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ తర్వాత అక్టోబర్ నుంచి ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు వరుసగా ప్రారంభోత్సవాలతో టీఆర్ఎస్ పెద్దలు నగరంలో బిజీ బిజీగా గడపనున్నారు. అదేవిధంగా మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు.

2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. తెలంగాణ పట్టణాభివృద్ది, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అంతా తానై ముందుకు నడిపించారు. అప్పటికి ఆయన మంత్రి మాత్రమే. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 సీట్లకు గాను 99 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంది. టీడీపీ నుంచి కేవలం ఒకే ఒక్కరు ఎన్నికయ్యారు. ఏపీ వాసులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా గులాబీ జెండా ఎగరేసింది. ఈసారి కేటీఆర్ అలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారా? అనేది చూడాలి. బీజేపీ గతంలో కంటే ప్రస్తుతం మరింత దూకుడుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా పోయిన పరువు నిలబెట్టుకోవడానికి జీహెచ్ఎంసీని వేదికగా చేసుకోవాలని చూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *