పోలీసుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన ఆందోళనకారులు

క్రైమ్
11 Views

హైదరాబాద్: ఉత్తర అమెరికాలోని మెక్సికోలో నిరసనకారులు పోలీసులపై తిరగబడ్డారు. ఓ పోలీసుపై పెట్రోల్ పోసి నిప్పటించారు. అక్కడే ఉన్న మిగతా పోలీసులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. వేంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. గ్వాడలజరాలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్కు వేసుకోనందుకు ఓ వ్యక్తిని పోలీసులు కొట్టిచంపే శారంటూ మెక్సికోలో నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో ఆందోళనకారులను అదుపు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులపై నిరసనకారులు దాడికి దిగారు. మాస్కు వేసుకోలేదని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తి మృతదేహం లభించింది. దీంతో పోలీసులే ఆ వ్యక్తిని కొట్టి చంపేశారని కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో మెక్సికోలోని గాదల్‌జారాలో నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారికి నిప్పంటించారు. ఇది చూసిన మిగతా అధికారులు వెంటనే స్పందించి.. మంటలను ఆర్పేసి, ఆ అధికారిని ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *