నాగుపాము కలకలం..

క్రైమ్
13 Views

ఒడిశాలోని నయాగడ్ జిల్లాకు చెందిన రమేష్ ప్రధాన్ అనే వ్యక్తి ఇంట్లో 10.5 అడుగుల పొడవైన నాగుపాము కనిపించింది. రమేష్ నిద్రపోతున్న సమయంలో ఏవో వింత శబ్దాలు వినిపించాయి. నిద్రలేచి చూసిన రమేష్‌కు గుండె జారినంత పనైంది. ఇంట్లో గుమ్మానికి వేలాడుతూ ఓ రాకాసి బల్లిని వేటాడుతూ కనిపించింది. దీంతో అతడు వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్ వాలంటీర్‌కు ఫోన్ చేశాడు. వాలంటీర్ వచ్చేసరికి బల్లి చనిపోయి ఉంది. పాము ఇంటి కప్పులోకి వెళ్లిపోయింది. ఆ పామును పట్టుకోడానికి వాలంటీర్ కొన్ని గంటల సేపు కష్టపడ్డాడు. ఎట్టకేలకు పామును పట్టుకున్నాడు. అనంతరం దాన్ని అడవుల్లో వదిలిపెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *