సిగరెట్లతో కాల్చి… మద్యం తాగించి..

క్రైమ్
14 Views

తిరువనంతపురం (కేరళ): కట్టుకున్న భార్యతో కిరాతకంగా ప్రవర్తించాడో భర్త. ఆమెతో బలవంతంగా మద్యం తాగించడమే కాకుండా శరీరంపై సిగరెట్లతో కాల్చి.. తన ఐదేళ్ల కుమారుడి ఎదుట నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తతోపాటు ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేరళలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…
తిరువనంతపురానికి చెందిన 25 ఏళ్ల మహిళ, ఐదేళ్ల కుమారుడిని ఆమె భర్త గురువారం సాయంత్రం బీచ్‌కు తీసుకెళ్లాడు. అనంతరం తన స్నేహితుడి ఇంటికి అనిచెప్పి ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ తమ ఐదేళ్ల కుమారుడు చూస్తుండగానే మహిళతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆపై నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతేకాకుండా బాధితురాలి శరీరాన్ని సిగరెట్లతో గాయపర్చాడని పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *