గన్ తో కాల్చుకుని బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి

క్రైమ్
10 Views

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన జరిగింది. విధినిర్వహణలో ఉన్న బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ తనను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా పంఖన్‌జోర్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీఎస్ఎఫ్ 157వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సురేష్‌కుమార్.. శుక్రవారం సహచరులతో కలిసి సంగం గ్రామం నుంచి అడవిలో నక్సల్స్ జాడ కనిపెట్టే కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లాడు. శనివారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణంలో ఘోడా, దొటమెట గ్రామాల మధ్యలో బీఎస్ఎఫ్ క్యాంపునకు 200 మీటర్ల దూరంలో తన చేతిలోని ఎకే-47 రైఫిల్‌తో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో సురేష్ కుమార్ అక్కడికక్కడే మరణించాడని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, ఆయన ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *