విషాదం.. ఈతకు వెళ్లి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు..

క్రైమ్
15 Views

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన విషాద ఘటన సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెజ్జంకి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ఐఐటి విద్యార్ధి పొన్నాల అనిల్(17), కరీంనగర్ జిల్లా మానాకొండూరు మండలం రంగంపేట గ్రామానికి చెందిన నంగునూర్ కుమార్ (29) అనే ఇద్దరు యువకులు సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయారు. అయితే సమాచారం అందుకున్నగ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చెరువులో యువకుల కోసం గాలించగా.. ఒకరి మృతదేహం లభ్యమయ్యింది. మరొక యువకుడి కోసం చెరువులో గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *