రూ. 4000 కోట్లు నష్టపోనున్న బీసీసీఐ

క్రీడలు
10 Views

కరోనా వైరస్ కారణంగా క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దవడంతో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఊహించనిరీతిలో నష్టాల్ని చవిచూస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల ఆదాయంతో క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సైతం ఇప్పుడు ఆర్థిక నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదాపడగా.. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐ సుమారు రూ. 4000 కోట్లు నష్టపోనుంది. ఆర్థిక నష్టాల్ని తగ్గించుకునేందుకు చాలా క్రికెట్ దేశాలు ఆటగాళ్లతో పాటు బోర్డు ఉద్యోగుల జీతాల్లోనూ కోతలు విధిస్తున్నాయి. కానీ.. బీసీసీఐ మాత్రం ఎలాంటి కోతలు లేకుండా.. అందరికీ జీతాలు చెల్లిస్తోంది. అయితే.. ట్రావెల్, వసతులు ఇతర సౌకర్యాల విషయంలో మాత్రం మనుపటిలా కాకుండా ఆచితూచి ఖర్చు చేస్తున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ వెల్లడించాడు. ”బీసీసీఐ గత ఏడాది అక్టోబరు నుంచే ఖర్చుల్ని తగ్గించుకోవడం ప్రారంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *