కరోనా వైరస్‌పై గెలిచారు.. .. ఫుట్ బాల్ మ్యాచ్ చూశారు..

క్రీడలు
12 Views

ప్రపంచవ్యాప్తంగా క్రీడా పోటీలు ఆగిపోయాయి. అయితే ఒక్క దేశం మాత్రం ధైర్యంగా ఫుట్ బాల్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. వియత్నాం దేశం కరోనాను విజయవంతంగా ఎదుర్కుంది. అన్నిదేశాలు ఇప్పుడు ఆదేశం వైపు చూస్తున్నాయి. ఆ దేశంలో కేవలం 328 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనించాల్సిన అంశం. అక్కడ ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. ఆర్ధిక వ్యవస్థను ట్రాక్‌లో పెట్టేందుకు ఈ కమ్యూనిస్ట్ దేశం తిరిగి అగ్రశ్రేణి ఫుట్‌బాల్‌ లీగ్‌ను ప్రారంభించింది. అసలే క్రీడల కోసం మొహం వాచిపోయిన క్రీడాభిమానులు అన్నింటిని పక్కన పెట్టి స్టేడియం వైపు అడుగులు వేశారు. సామాజిక దూరాన్ని సైతం పాటించకుండా వేలల్లో మ్యాచ్‌కు హాజరయ్యారు. శుక్రవారం నామ్ దిన్హ్‌లోని స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు ఏకంగా 30,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.ఇక వచ్చిన వారందరికీ సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించగా.. అందరికీ అందుబాటులో హ్యాండ్ శానిటైజర్లను కూడా ఉంచారు. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన వారెవ్వరూ కూడా మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి నియమాలను మాత్రం పట్టించుకోలేదు. కాగా, స్పెయిన్, ఇంగ్లాండ్, ఇటలీలోని లీగ్‌లు ఈ నెలాఖరులో తిరిగి ప్రారంభం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *