టాలీవుడ్ వివాదానికి ముగింపు పలకబోతున్నారా.

సినిమా
10 Views

టాలీవుడ్ వివాదానికి ముగింపు పలకబోతున్నారా?? ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య భేటీపై క్లారిటీ వచ్చింది. చిరంజీవి.. బాలయ్యను ఈ భేటీకి వస్తున్నారా… అసలు 9తేదీన ఏం జరగబోతుంది?

కరోనా ఎఫెక్ట్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత 70 రోజులుగా షూటింగ్‌లతో సహా అన్ని పనులు నిలిచిపోయాయి. థియేటర్స్ మూత పడ్డాయి. విడుదల కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్స్ పనులు ముందుకు కదిలే పరిస్థితి లేదు.. వేలాది మంది సినీ కార్మికులు పనిలేక, పూట గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో చలన చిత్రం రంగం పడుతున్న ఇబ్బందుల్ని తెలుగు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకుని వెళ్లారు ఇండస్ట్రీ పెద్దలు.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాటు మంత్రి తలసానిని కలిసిన సినీ పెద్దలు… ఇప్పుడు ఈనెల 9న ఏపీ సిఎం జగన్‌ను కలవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఒక కార్యచరణతో రమ్మని టాలీవుడ్‌కి జగన్‌ ఆహ్వానం పంపారు. దీంతో మెగాస్టార్‌ చిరంజీవి అధ్యక్షతన కొంతమంది పెద్దలు జగన్‌ను కలవనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *