ఐసీఎంఆర్ కు కరోనా ఎఫెక్ట్

బిజినెస్‌
14 Views

భారత వైద్య పరిశోధన మండలికి సైతం కరోనా ఎఫెక్ట్ తప్పటం లేదు. కరోనా వైరస్ కట్టడిలో కొంతకాలంగా ఐసీఎంఆర్ క్రీయాశీలకంగా పనిచేస్తోంది. రోజుకు వందల సంఖ్యలో మాత్రమే టెస్టులు చేయగల సామర్థ్యం నుండి ఇప్పుడు రోజుకు 1,43,661 టెస్టులు చేసే స్థాయికి వచ్చింది. ఇప్పటి వరకు దేశంలో 43లక్షల 86వేల పైచిలుకు టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.

కానీ ఐసీఎంఆర్ ను కరోనా వైరస్ కలవరపెడుతోంది. దేశ ప్రజలకు జాగ్రత్తలు చెప్పే తమ ఉద్యోగులను సైతం కరోనా వెంటాడుతోంది. ఐసీఎంఆర్ కు చెందిన సీనీయర్ సైంటిస్ట్ ఒకరికి వైరస్ సోకినట్లు ధృవీకరించారు. ముంబైలో పనిచేసే ఆయన ఇటీవలే ఢిల్లీ వచ్చారు. ఇంతకు ముందు ఐసీఎంఆర్ లో పనిచేసే మరో ఉద్యోగికి సైతం కరోనా సోకినట్లు వార్తలొచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *