విశాఖ జిల్లాలో ఒక్కరోజే 17 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్
11 Views

లాక్‌డౌన్‌ సడలింపులతో మొదలైన ఓ వ్యాపారి నిర్లక్ష్యం అనకాపల్లి కొంపముంచింది. ఒక ఎలక్ట్రికల్‌–ఎల్రక్టానిక్స్‌ వస్తువుల వ్యాపారి కుమారుడు, ఓ మెటల్‌ షాప్‌లో పనిచేస్తున్న వ్యక్తి కాంటాక్ట్‌తో ఏకంగా 14 కరోనా పాజిటివ్‌ కేసులు శుక్రవారం వెలుగుచూశాయి. ఇది మరింత వ్యాపించే ప్రమాదం ఉండటంతో లాక్‌డౌన్‌ తర్వాత ఆయా దుకాణాలకు వెళ్లినవారెవ్వరో తెలుసుకునేందుకు అధికారులు జల్లెడ పడుతున్నారు. పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌ నుంచి దుకాణ సముదాయాలున్న చింతావారివీధి వరకూ రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. కానీ కరోనా కేసుల కలకలంతో జనజీవనం స్తంభించింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *