వరంగల్లో 9 మంది మరణాలకు కారణం ఇదే..!

తెలంగాణ
7 Views

వరంగల్‌ రూరల్‌ : వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఉన్న ఒక గోనె సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో లభించిన 9 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. వరంగల్ ఎంజీఎం వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం వారు నీటిలో మునగడం వల్ల చనిపోయినట్టు నిర్ధారించారు. 9 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా, అందులో ఏడుగురి ఊపిరితిత్తుల్లో నీళ్లు కనిపించాయి. రెండు డెడ్ బాడీల్లోని ఊపిరితిత్తుల్లో నీరు కనిపించలేదు. వారి శరీరం మీద గీరుకుపోయిన మచ్చలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత తీసుకొచ్చి వేశారా? బతికి ఉండగానే లాక్కొచ్చి అందులో వేశారా? అనే అంశాన్ని పరిశీలిస్తే బతికి ఉన్నప్పుడే తీసుకొచ్చి బావిలో వేసినట్టు కనిపిస్తోందని వైద్యులు చెప్పారు. అలాగే కొన్ని మృతదేహాలు నిద్రపోతున్నప్పుడు తీసుకొచ్చి బావిలో వేసినట్టుగా కూడా ఉన్నాయన్నారు. పెనుగులాట జరిగినట్టు, కొట్టుకున్నట్టు ఎలాంటి ఆనవాళ్లు లేవు. తీవ్ర గాయాలు కూడా లేవని చెప్పారు. రక్తస్రావం లాంటివి కూడా ఏవీ లేవన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *