ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది వెంటనే భర్తీ: జగన్

ఆంధ్రప్రదేశ్
8 Views

అమరావతి: ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. విశాఖ, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో పీహెచ్‌సీ స్థాయి వరకు కోవిడ్‌ టెస్టింగ్‌ శాంపిళ్లు సేకరణ, ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆదేశించారు. 8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఇప్పుడున్న దానికంటే ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్య పెంచాలని సూచించారు. కరోనా సోకడం నేరం, పాపం కాదు, భయాందోళనను తొలగించాలని సూచించారు. పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, కనీస జాగ్రత్తలతో, వైద్యసహాయంతో కోలుకోవడం సులభమని జగన్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *