కూకట్ పల్లిలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదు

తెలంగాణ
6 Views

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం రోజు కూకట్ పల్లిలో కొత్తగా మరో 2 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. రెండురోజుల క్రితం కరోనాతో చనిపోయిన వృద్ధుని డ్రైవర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. రెయిన్ బో విస్టా అపార్ట్ మెంట్ లోని అపోలో డాక్టర్ అనురూప్ ఇంట్లో మరో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *