ఫీవర్ ఆస్పత్రి చెత్తబుట్టలో పసికందు

క్రైమ్
9 Views

ఓ ఆసుపత్రి వద్ద చెత్తబుట్టలో పసికందు కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. ఫీవర్ ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డులో డస్ట్ బిన్‌లో పసికందు లభ్యం అయిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎవరో గుర్తు తెలియని మహిళ పసికందును వదిలి వెళ్ళిపోయిందని తెలిపారు.

ఉదయం 5:30 ప్రాంతంలో బురఖాలో వచ్చిన గుర్తు తెలియని మహిళ, శిశువును డస్ట్ బిన్‌లో పడవేసినట్లుగా గుర్తించారు. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు వార్డు క్లీనింగ్ చేస్తున్న సిబ్బంది ఆ పసికందును గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆమెని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, పాపని పరీక్షల నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *