పడకల సంఖ్య పెంచండి: సీఎం జగన్‌

రాజకీయం
4 Views

అమరావతి: రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఉన్న కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను పెంచాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. కరోనా సోకడం పాపం, నేరం కాదని.. వైరస్‌ ఎవరికైనా వ్యాపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించి, వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కనీస జాగ్రత్తలు, వైద్య సాయంతో కరోనా నుంచి కోలుకోవడం సాధ్యమని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రలో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో ప్రాథమిక కేంద్రాల స్థాయి వరకూ ప్రయోగాత్మకంగా కరోనా పరీక్షలను తీసుకెళ్లాలని సీఎం జగన్‌ అధికారులకు నిర్దేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *