చంద్రబాబుది కరోనా కుటుంబం: అమర్నాథ్

రాజకీయం
8 Views

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది కరోనా కుటుంబం అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో కేసులు వేసుకుంటూ చంద్రబాబు బ్రతికేస్తున్నారని విమర్శించారు. జగన్‌కు మంచి పేరు రాకుండా అడ్డుకోవాలని అనునిత్యం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మూడు నెలలుగా చంద్రబాబు జూమ్ యాప్‌లో తప్ప ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మార్కెటింగ్, మేనేజింగ్, పబ్లిసిటీ తప్ప ఏమీ తెలియదని నిప్పులు చెరిగారు. ప్రభుత్వంపై నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు, ట్వీట్ల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల హామీలను 90శాతం నెరవేర్చామని అన్నారు. కష్టకాలంలో సైతం ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేనలతో పోరాటం చేసి 151 సీట్లు సాధించారని కొనియాడారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు చరిత్రలో ఈ విజయం మిగిలిపోతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *