వెంకన్న ఆస్తులను వేలం వేయనున్న టీటీడీ

ఆంధ్రప్రదేశ్
4 Views

ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం తాను అనౌన్స్ చేసిన పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఇది నడుస్తుండగా, మరో వైపు టీటీడీ కూడా ఇదే పద్దతికి శ్రీకారం చుట్టింది. టిటిడి ఆస్తులను అమ్మడానికి ఏప్రిల్ 30 నుంచే ప్రొసీడింగ్స్ కూడా మొదలు పెట్టింది. తాజాగా నిరర్ధక ఆస్తుల విక్రయాల ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రారంభించింది. తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఆస్తుల విక్రయాలకు టీటీడీ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటి విలువ కోటిన్నరకు పైగా ఉంటుందని అంచనా. నిరర్ధకమైన ఆస్తుల విక్రయాల ద్వారా.. రూ.100 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని టీటీడీ భావిస్తోంది. మరోవైపు నిరర్ధక టీటీడీ ఆస్తుల విక్రయాలను తక్షణమే ఆపాలని సీఎంకు లేఖ రాశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *