సినిమా షూటింగ్‌లపై త్వరలోనే నిర్ణయం: కిషన్ రెడ్డి

తెలంగాణ
4 Views

హైదరాబాద్: సినిమా షూటింగ్‌లకు సంబంధించి త్వరలోనే అనుమతులు జారీ చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం తెలుగు సినిమా ప్రముఖులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సురేష్ బాబు, డైరెక్టర్ తేజ, జెమినీ కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము, వివేక్‌ కూచిభొట్ల, అనిల్‌ శుక్ల, అభిషేక్‌ అగర్వాల్‌, శరత్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. సినిమా షూటింగ్‌ల ప్రారంభానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతర్జాతీయ సినిమా పైరసీపై మీటింగ్ నిర్వహించి కొత్త చట్టం చేస్తామని పేర్కొన్నారు. ఓటీటీలో రిటీజ్ అయ్యే సినిమాకు సెన్సార్ ఉండేలా ఆలోచన చేస్తామన్నారు. జమ్మూకశ్మీర్‌తో సహా దేశ వ్యాప్తంగా షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతులిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు ఓపెన్ అయ్యేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *