పరిశ్రమలకు ప్రాణం

ఆంధ్రప్రదేశ్
4 Views

ఎంఎస్‌ఎంఈలకు రూ.1,110 కోట్ల రీస్టార్ట్‌ ప్యాకేజీనీ ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

గత ప్రభుత్వం బకాయిలు రూ.450 కోట్లు విడుదల

మూడు నెలలకు సంబంధించి కరెంటు ఫిక్స్‌డ్‌ చార్జీలు రద్దు

రూ.10లక్షల వరకు తక్కువ వడ్డీకే ఎంఎస్‌ఎంఈలకు రుణాలు

ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు..

మా సమస్యలకన్నా మీ సమస్యలు ఎక్కువని భావించి ముందడుగు వేస్తున్నాం

ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యత

నిరుద్యోగం పెరగకుండా ఈ చర్యలు

వాటికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునేందుకు సిద్ధమని సీఎం భరోసా

ఎంఎస్‌ఎంఈల బాధ్యతలు మూడో జేసీకి

ప్రభుత్వ కొనుగోళ్లలో 25 శాతం వీటి నుంచే చేయాలని నిర్ణయం

రాష్ట్రంలో 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు

పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యం గల కార్మికులు అవసరమో కలెక్టర్లు గుర్తించాలి

ఎంఎస్‌ఎంఈల్లో దాదాపు 2.80 లక్షల మంది వలస కార్మికులు పనిచేస్తుండగా, వారు వెళ్లిపోయారు. అదే సమయంలో మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి 1.30 లక్షల మంది వచ్చారు. స్కిల్‌ గ్యాప్‌ రాకుండా వారికి శిక్షణ ఇవ్వడంపై అధికారులు దృష్టిపెట్టాలి.

గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఎగ్గొట్టిన బకాయిలు రూ.828 కోట్లు. 2014-15లో 43 కోట్లు, 2015-16లో 70 కోట్లు, 2016-17లో 195 కోట్లు, 2017-18లో 207 కోట్లు, 2018-19లో 313 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20లో బకాయిలు రూ.77 కోట్లు. అన్నీ కలిపి రూ.905 కోట్లు మంజూరు చేశాం. ఇవాళ రూ.450 కోట్లు ఇస్తున్నాం. మిగిలినవి జూన్‌ 29న ఇస్తాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *