నాణ్యత లేని విత్తన సంస్థలపై వేటు

క్రైమ్
5 Views

అమరావతి: ► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తి. డి.వెంకటరాయుడు మూడు మూటల విత్తన కాయల్ని తీసుకున్నాడు. మూట విప్పి చూస్తే అవి కె-6 రకంగా అనిపించలేదు. కాయల్ని వలవకుండానే రెండు మూడు కిలోల విత్తనాలు కిందపడ్డాయి. అవి నాణ్యత లేనివిగా గుర్తించి గ్రామ వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశాడు.
► అనంతపురం రూరల్‌ మండలం నారాయణపురానికి చెందిన జగన్‌ మూడు బస్తాల వేరుశనగ విత్తనాన్ని కొన్నాడు. కాయల్ని కొట్టి విత్తనాన్ని చూస్తే పప్పు పుచ్చిపోయి, ఏమాత్రం నాణ్యత లేకుండా ఉంది. దీంతో తనతోపాటు కాయల్ని కొన్న 130 మంది రైతులతో కలిసి శుక్రవారం అధికారులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *