మీ సేవలకు సలామ్‌

తెలంగాణ
6 Views

కరోనా మీద ప్రస్తుతం ప్రపంచం పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో కరోనాను కట్టడి చేయడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ముందుండి పోరాడుతున్నారు. వాళ్ల సేవలకు సలామ్‌ చేస్తూ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్‌ ఓ పాటను రూపొందించారు. రచయిత బాలాజీ రచించిన ఈ పాటను సుమారు పది మంది (మనో, టిప్పు, శ్రీకృష్ణ, సాయి చరణ్, నిహాల్, గీతా మాధురి, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణి, బేబి) గాయనీ గాయకులు ఆలపించారు. ఈ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి విడుదల చేసి, ”మనకోసం పోరాడుతున్న వాళ్ల సేవలను గుర్తిస్తూ ఓ పాటను చేయడం మంచి విషయం. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు. ”కరోనా నుంచి మనల్ని కాపాడుతున్న అందరికీ చేతులెత్తి మొక్కాలి. నాకు సహకారం అందించిన అందరికీ ధన్యవాదాలు” అన్నారు సంగీత దర్శకుడు మహిత్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *