మీ ఆటకు మీరే బాధ్యులు.. మాకు సంబంధంలేదు: సాయ్

క్రీడలు
6 Views

న్యూఢిల్లీ: క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రొత్సహించాల్సిన స్పోర్ట్స్‌ అథారిటీ అఫ్ ఇండియా (సాయ్‌) కరోనా పరిస్థితుల నేపథ్యంలో బాధ్యత మరిచే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌ (ఎస్‌ఓపీ) పేరిట నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేసిన ‘సాయ్‌’ తాజాగా ఎవరి ఆటకు వారే బాధ్యులనే సమ్మతి లేఖను సమర్పించాలని ఆటగాళ్లను కోరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆటగాళ్లకు వెన్నంటే మద్దతివ్వాల్సిన సాయ్‌… ఇప్పుడీ కొత్త నిబంధన జతచేసింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆటగాళ్లు ఆడేక్రమంలో, శిక్షణ తీసుకునే విషయంతో ‘మాదే బాధ్యత ఇందులో సాయ్‌కి గానీ, సంబంధిత క్రీడా సమాఖ్యకు గానీ సంబంధం లేదు’అనే డిక్లరేషన్‌ ఇవ్వాలని కోరింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాకుండా ‘రిలే ట్రైనింగ్‌లో బ్యాటన్ ఎక్స్ చేంజ్‌కు అనుమతి ఉండదు. బాక్సర్లు రింగ్స్‌లోకి రాకూడదు. ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్‌లో సింగిల్స్ ప్లేయర్లు మాత్రమే ప్రాక్టీ చేయాలి.’ అని రెండు నెలల విరామం తర్వాత ప్రాక్టీస్‌కు సిద్దమవుతున్న అథ్లెట్లకు ఆంక్షలు విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *