అప్పుడెలా ఉన్నాడో.. ఇప్పుడు అచ్చం అలానే!!

సినిమా
6 Views

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకుల్లో రానా ముందుటాడు. రానా ఒకప్పుడు సౌత్ హీరోయిన్ తో డేట్ చేసాడని.. రానాపై ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. కానీ రానా మాత్రం ఎప్పుడూ ఈవార్తలపై స్పందించలేదు. కానీ తాజాగా రానా.. మెహీక బజాజ్ అనే అమ్మాయితో డేట్ లో ఉన్నట్లుగా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా చెప్పి షాకిచ్చాడు. అసలైతే రానా చెబితే ఎవరూ పెద్దగా షాకయ్యేవారు కాదు కానీ.. కరోనా లాక్ డౌన్ సమయంలో రానా తన పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా కరోనా లాక్ డౌన్ సమయంలోనే మెహిక తో రానా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు.

నిన్న రానా ఎంగేజ్మెంట్ ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యలో అంగరంగ వైభవంగానే జరిగింది. అయితే ఈ వేడుకలో రానా వేసిన బట్టలు, స్టయిల్ అన్ని రానా సూపర్ హిట్ ఫిలిం ని తలపించాయి. రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా వైట్ లుంగీ కట్టి. వైట్ అండ్ వైట్ షార్ట్ తోనే ఎక్కువగా కనిపిస్తాడు. అలాంటి కాస్త్యుమ్స్ లోనే రానా తన ఎంగేజ్మెంట్ చేసుకోవడం మాత్రం సూపర్ అనే చెప్పాలి. మెహిక సాంప్రదాయ చీర కట్టులో అదిరిపోగా.. రానా వైట్ లుంగీ లో మెరిసిపోయాడు. రానా అండ్ మెహిక లను చూడగానే నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాధా జోగేంద్ర అంటే రానా – కాజల్ అగర్వాల్ లు గుర్తుకు రాక మానరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *