మంచు మనోజ్ కూడా తగ్గడం లేదు!!

సినిమా
5 Views

మంచు మనోజ్ వరస వైఫల్యాలతో. ఒకొనొక టైం లో సినిమాలకు ప్యాకప్ చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడని అనుకున్నారు. అంతేకాకుండా మధ్యలో మనోజ్ భార్య తో విభేదాలు, విడాకులు అంటూ కాస్త సఫర్ అయ్యాడు. మంచు మనోజ్ విడాకుల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా లేవల్లోనే. అహం బ్రహ్మస్మి అంటూ నిర్మాతగా. హీరోగా సినిమాని మొదలెట్టాడు. ఈ సినిమాని మనోజ్ భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం మనోజ్ భారీ గా ఓ ఫైట్ చేయబోతున్నాడట.

ఇంతకుముందు మనోజ్ తన సినిమాల్లోని ఫైట్స్ ని తానే కంపోజ్ చేసుకునేవాడు. అయితే ఇప్పుడు అహం బ్రహ్మస్మి సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి. ఈ సినిమాకి ఓ ప్రత్యేకమైన ఫైట్ ని మంచు మనోజ్.. ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హాయిన్స్ తో కలిసి ఏకంగా యాభై రోజుల పాటు ఈ ఫైట్ కంపోజ్ చేయబోతున్నారట. నేనూ.. పీటర్ హైన్స్ కలసి పనిచేయడం ఇదే తొలిసారి. అందుకే ఆ ఫైట్ ని కొత్తగా చూపించాలని ప్రయత్నిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *