ఏం జరుగుతుంది రవితేజా?

సినిమా
9 Views

రవితేజ నటించిన వరస సినిమాలు ప్లాప్ అవుతున్నప్పటికీ.. ఎక్కడా తగ్గడం లేదు. వరస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకుడిగా క్రాక్ సినిమాలో నటిస్తున్న రవితేజ ఆ సినిమా షూటింగ్ ని ఏకధాటిగా చేసాడు. కరోనా లక్డౌన్ తో ప్రస్తుతం క్రాక్ సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ రాక్షసుడు దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడని.. కథ చర్చలు పూర్తయ్యాయని. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళుతుంది అని వార్తలొచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం రవి తేజ – రమేష్ వర్మ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఎందుకంటే ఈ చిత్రాన్ని నిర్మించే నిర్మాతలు ఈ సినిమా బడ్జెట్ విషయంలో జరిగిన చిన్నపాటి అవకతవకల వలన ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. అసలు ఈ ప్రాజెక్ట్ అంతా చక్కబడి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి అంటున్నారు. అయితే ఈలోపు రవితేజ మరో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి సిద్దమవుతున్నాడని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *