సూపర్ స్టార్ ఫిట్ నెస్ రహస్యం తెలిసిపోయింది.మిగతా హీరోలు ఫాలో అవుతారా.?

సినిమా
7 Views

అమ్మాయిల మనసు కొల్లగొట్టే అందం ఉట్టిపడే సూపర్ స్టార్ మహేష్ బాబు అనగానే మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. బాల నటుడి నుంచే సత్తా చాటిన మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గా అనతికాలంలోనే ఎదిగాడు. తండ్రి కృష్ణను మించిన హీరోగా రాణిస్తున్నాడు. నిజానికి మహేష్ బాబు అందం.. బాడీ ఫిట్ నెస్ చూస్తే, నాలుగు పదుల వయస్సు వచ్చినా ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా అనిపిస్తాడు. దీన్ని బట్టి ఏ రేంజ్లో బాడీ మెయింటేన్ చేస్తాడో ఊహించవచ్చు. అందుకే మహేశ్ అంటే యూత్ అంతలా పడిచచ్చేలా ప్రేమిస్తుంటారు. ఇక మహేష్ అందానికి.. ఫిట్ నెస్ కు ఫిదా అయిపోయి లేడీ ఫ్యాన్స్ వీరలెవెల్లో ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య పోస్ట్ చేస్తున్న ఫోటోలలో మహేష్ లుక్ చూస్తే గౌతమ్ కి అన్నలా ఉన్నాడంటూ కామెంట్స్ పడిపోతున్నాయి.

సూపర్ స్టార్ లుక్స్ కి టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తంలో కూడా ఎవరూ పోటీ కి సరిరారని అంటుంటారు . రోజురోజుకు తన గ్లామర్ ను పెంచుకుంటూ వెలుతున్న మహేష్ సీక్రెట్ ఏంటని తెలుసుకోడానికి అందరికీ ఆశక్తిగానే ఉంటుంది. అయితే మహేష్ ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి అతనికి జిమ్ ట్రైనర్ గా పని చేసిన మినాష్ గాబ్రియేల్ సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు చెప్పడంతో షాక్ కి గురిచేశాయి. మినాష్ గాబ్రియల్ అనే ప్రొఫెషనల్ జిమ్నాజియం ట్రైనర్ గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు. పెద్ద పెద్ద అథ్లెట్స్ మొదలుకుని స్టారో హీరోల వరకు ఈయన దగ్గరికే ఫిట్ నెస్ కోసం వస్తుంటారు. టాలీవుడ్ సూపర్ స్టార్ కు కూడా మినాషే ట్రైనింగ్ ఇచ్చాడు. మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో గత ఏడాది వచ్చిన ‘మహర్షి’ సినిమా కోసం మహేష్ లుక్ కోసం ఫిట్నెస్ ట్రైనర్ గా మినాష్ గాబ్రియేల్ వర్క్ చేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *