‘మంకీ’ పెట్టిన చిచ్చు..!

క్రీడలు
8 Views

ఒక ఆటగాడు తన చర్యలతోనో, వ్యాఖ్యలతోనే వివాదం రేపడం… అతనిపై ఐసీసీ చర్య తీసుకోవడం క్రికెట్‌ చరిత్రలో లెక్క లేనన్ని సార్లు జరిగాయి. అయితే ఇద్దరు ఆటగాళ్ల మధ్య మైదానంలో సాధారణంగా కనిపించిన గొడవ చివరకు ముదిరి ఇరు దేశాల బోర్డుల మధ్య గొడవగా మారడం… దాదాపు న్యాయస్థానంలో జరిగినట్లుగా లాయర్లతో కలిసి వివాద పరిష్కారం చేయాల్సి రావడం అరుదు. అయితే భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన 2007-08 సిరీస్‌ టెస్టు అలాంటిదే. అంపైర్ల తప్పుడు నిర్ణయాలతో అప్పటికే భారత్‌కు ఓటమి ఎదురు కాగా, హర్భజన్‌పై ‘జాతి వివక్ష’ వ్యాఖ్యల ఆరోపణలు వెరసి టీమిండియా సిరీస్‌ను బాయ్‌కాట్‌ చేసే వరకు వచ్చింది. ‘మంకీ గేట్‌’గా ఈ ఉదంతానికి మచ్చ పడింది.

అనిల్‌ కుంబ్లే నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటించిన భారత జట్టు మెల్‌బోర్న్‌లో జరిగిన తొలి టెస్టులో 337 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. అయితే కోలుకున్న టీమ్‌ సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 463 పరుగులు చేయగా, సచిన్‌ (153), లక్ష్మణ్‌ (109) సెంచరీల సహాయంతో 532 పరుగులు చేసిన భారత్‌ 69 పరుగుల ఆధిక్యం అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 401 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసిన ఆసీస్‌ చివరి రోజు భారత్‌ ముందు కనీసం 73 ఓవర్లలో 333 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్‌కు ఇదేమీ పెద్ద కష్టం కాదు. అయితే ఇద్దరు అంపైర్లు స్టీవ్‌ బక్నర్, మార్క్‌ బెన్సన్‌ తప్పుడు నిర్ణయాల కారణంగా చివరకు జట్టు ఓటమిపాలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *