ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

బిజినెస్‌
5 Views

కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది. గత రెండునెలలుగా జనం ఇంటి పట్టునే వుంటున్నారు. రెస్టారెంట్లనుంచి ఫుడ్ తెప్పించుకునే అవకాశం లేదు. బిజినెస్ కూడా పడిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ 4.Oలో భాగంగా సడలింపులు ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలయితే లిక్కర్ కూడా డోర్ డెలివరీ చేయవచ్చని చెప్పడంతో అనేక సంస్థలు పోటీపడుతున్నాయి.కష్ట కాలంలో కస్టమర్ల ఇంటి దగ్గరే సేవలందించేందుకు ఫుడ్ బిజినెస్ సంస్థలు పోటీ పడుతున్నాయి.. అనేక నగరాల్లో పేరొందిన హోటళ్లు ఇప్పటికే ఫుడ్ డోర్ డెలివరీ సేవల్లోకి దిగిపోయాయి. వీటికి పోటీ ఇస్తూ లేటెస్టుగా ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అమెజాన్ మొదట బెంగళూరులో ఫుడ్ సప్లయ్ సేవలను ప్రారంభించింది ప్రస్తుతం బెంగళూర్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో తమ సేవలు అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రాథమికంగా కొన్ని రెస్టారెంట్ల నుంచే వీటిని డెలివరీ చేస్తామని అమెజాన్ తెలిపింది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఫుడ్‌ డెలివరీ సేవలు విస్తరించే ప్రయాత్నాల్లో అమెజాన్‌ ఉంది.ఇప్పటికే మార్కెట్లో ఫుడ్‌ డెలివరీ సర్వీసుల్లో దూసుకెళ్తున్న స్విగ్గీ, జొమాటో సంస్థలు కరోనా వైరస్‌ ప్రభావంతో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే మంచి సమయంగా భావించి అమెజాన్ ఫుడ్‌ డెలివరీ రంగంలోకి దిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *