రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్నాం..

ఆంధ్రప్రదేశ్
54 Views

అమరావతి: కష్టకాలంలో సైతం రైతుల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రమిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకు గుండె తరుక్కుపోతుందో అర్థం కావడంలేదని.. బహుశా సీఎం వైఎస్‌ జగన్‌ రైతులను ఆదుకోవడానికి స్పందిస్తున్న తీరు చూసి గుండె తరుక్కుపోతుందేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. టమోటా పంటలు కొనుగోలు చేస్తున్నందుకు ఆయన బాధపడుతున్నారా అని ఎద్దేవా చేశారు. రైతుల కోసం సీఎం జగన్‌ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను నీ హయాంలో ఎందుకు చేయకలేకపోయావంటూ చంద్రబాబును నిలదీశారు. (కరోనా కట్టడిలో మరో వినూత్న ఆలోచన)

”ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించమని సీఎం జగన్‌ చెప్పారు. రైతు భరోసా ఫైనల్ లిస్ట్ ఇంకా తయారు కాలేదు. అప్పుడే 4 లక్షల మంది రైతులను తొలగించారంటున్నారు. ఎక్కడ తొలగించారో చంద్రబాబే చెప్పాలి. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయబట్టే ప్రజలు 23 సీట్లు ఇచ్చారు. తడిసిన ధాన్యంతో పాటు అకాల వర్షాలకు నష్టపోయిన వారిని వెంటనే ఆదుకుంటున్నాం. రైతుల మన్ననలు పొందుతున్నామని ఆయనకు కడుపు మంట” అంటూ చంద్రబాబుపై కన్నబాబు నిప్పులు చెరిగారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *