మన దేశ సంరక్షణ మన చేతుల్లోనే ఉంది

కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అబ్దుల్ మునాఫ్

ఆంధ్రప్రదేశ్
146 Views
మన దేశ సంరక్షణ మన చేతుల్లోనే ఉంది
ప్రజలు పోలీసులకు సహకరించాలి
కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టవలసిన బాధ్యత అందరిపైనా ఉంది
ఏ ఐ ఎం ఐ ఎం నాయకులు  అబ్దుల్ మునాఫ్
కర్నూలు ,మార్చి 26 , ( సీమ కిరణం న్యూస్ ) :  ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టవలసిన బాధ్యత అందరిపైనా ఉందని  ఏ ఐ ఎం ఐ ఎం  నాయకులు  అబ్దుల్ మునాఫ్ తెలిపారు. ఈ సందర్భంగా  గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజలు ఎవ్వరు ఇంటి నుండి బయటకు రాకుండగా పోలీసులకు ప్రభుత్వానికి సహకరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ చేయడం జరిగింది.ఈ విపత్కర పరిస్థితుల్లో చాలా మంది రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా తయారయ్యింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో కరెంట్ బిల్లులు, బ్యాంకు లకు కట్టే ఈఎంఐ లను రెండు నెలలు వాయిదా వెయ్యాలి .ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున 4000 రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 6000 రూపాయలు పేద మధ్య తరగతి జనాల అకౌంట్లలో జమ చేయవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కర్నూలు ఏ ఐ ఎం ఐ ఎం నాయకులు అబ్దుల్ మునాఫ్ డిమాండ్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *