సినీ కార్మికులకు ఆదుకునేందుకు ముందుకు వచ్చిన రోజా

ఆంధ్రప్రదేశ్
53 Views

కరోనా ప్రభావంతో ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్న వేలాది మంది శ్రామికులు, కళాకారులు పనుల్లేక తిండికోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏరోజు ఆ రోజు పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకునే సినీ కార్మికులు చాలా మంది పరిస్థితి దయనీయంగా తయారైంది. అయితే ఇలాంటి వాళ్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సినీనటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా. పేదకళాకారుల ఆకలి తీర్చేందుకు 100 బస్తాల బియ్యాన్ని విరాళంగా ప్రకటించారు. అంతేకాదు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి సహాయపడేందుకు త్వరలో జోలె పట్టి విరాళాలు సేకరించేందుకు ఆలోచన ఉన్నారట రోజా. ఇలాంటి కరువు పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీనే నమ్ముకున్న తమని దాతలు ఆదుకోవాలంటున్నారు పేద కళాకారులు. సినిమాల ద్వారా కోట్లు కోట్లు సంపాదించిన స్టార్ హీరోలు, బడా దర్శకులు, నిర్మాతలు కరోనాపై రూపాయి ఖర్చులేకుండా ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పెట్టిన వదిలేయకుండా పేదలకు సాయం చేసి వాళ్ల ఆకలి తీర్చడానికి ముందుకు రావాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *