ఏ ప్రాంతం వాళ్లు అక్కడే ఉండండిః సిఎం జగన్‌

రాజకీయం
5 Views

తాడేపల్లి : కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలో ఉన్న జనం అక్కడే ఉండాలని సూచించారు. నిర్లక్ష్యంగా ఉంటే సమస్య పెద్దది అయ్యే ప్రమాదంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 14 వరకూ ఎక్కడికి కదలకుండా ఉండాలని కోరారు. నిన్న జరిగిన ఘటనలు తనను ఆవేదన వ్యక్తం చేశాలా ఉన్నాయన్నారు. ఏపీ బోర్డర్‌లో మన వాళ్లు నిలిచిపోవడం ఇబ్బందికరంగానే ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న మన తెలుగువాళ్లకి ఇబ్బంది లేకుండా అక్కడి ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు భరోసా ఇచ్చారు. భయపడకుండా ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండాలని పదే పదే కోరారు. ప్రతి ఇంటికి తిరిగి వైద్యం అందిస్తున్న గ్రామస్థాయి వాలంటీర్లు, గ్రామ సెక్రటరీలు, ఆశావర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వీరంతా కృషి చేయడం వల్లే కేవలం 10 కేసులు మాత్రమే నమోదు అయినట్లు ఆయన వివరించారు. ఎవరికి వాళ్లు ఒకరికి మధ్య ఇంకొరికి దూరం పాటించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *