వికారాబాద్‌లో విషాదం.. గ్రామ సర్పంచ్ ఆత్మహత్య

క్రైమ్
6 Views

వికారాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు గానీ ఓ గ్రామ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ అపర్ణ. అపర్ణ బుధవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మార్గమధ్యలో అపర్ణ చనిపోయింది. కాగా సర్పంచ్ అపర్ణ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయాలు తెలియాల్సి ఉంది. అపర్ణ మృతి చెందడం పట్ల గ్రామస్తులు తీవ్ర సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *